Share News

kumaram bheem asifabad- ఇంటర్‌లో కొత్త కోర్సు

ABN , Publish Date - May 17 , 2026 | 10:14 PM

ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త కోర్సు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అకౌంట్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులతో కలిపి ఏసీఈ గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. జూన్‌లో ప్రారంభమయ్యే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలతో పాటు గురుకులాలు, మోడల్‌ కాలేజ్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది.

kumaram bheem asifabad- ఇంటర్‌లో కొత్త కోర్సు
ఇంటర్‌ కళాశాల

వాంకిడి, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త కోర్సు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అకౌంట్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులతో కలిపి ఏసీఈ గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. జూన్‌లో ప్రారంభమయ్యే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలతో పాటు గురుకులాలు, మోడల్‌ కాలేజ్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్‌లో బైసీపీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఎంఈసీ కోర్సులున్నాయి.

పుష్కలంగా ఉపాధి అవకాశాలు..

ఏసీఈ చదివే విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని డిగ్రీలో కామర్స్‌ గ్రూపులో చేరొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీలో బీకాం, బీఏ అనంతరం ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు అవకాశం కల్పించారు. సీఏలో సైతం చేరే అవకాశం కల్పించారు. బ్యాంకింగ్‌, అడ్మినిస్ర్టేన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ మార్కెటింగ్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఈసీ గ్రూపు కనువరుగయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు కేజీబీవీ, మొడల్‌, ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త కోర్సు వస్తృతంగా ప్రచారం చేయాలని ఇంటర్‌బోర్డు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌కు సూచించింది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలలు, ప్రైవేటు కళాశాలలు ఈ కొత్త గ్రూపు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది.

Updated Date - May 17 , 2026 | 10:14 PM