Share News

ఇంటిపన్ను లేదు.. ఆటో చార్జీ ఉండదు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:24 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పలువురు సర్పంచ్‌లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లా తిరుమలగిరి...

ఇంటిపన్ను లేదు.. ఆటో చార్జీ ఉండదు

  • సర్కారి బడిలో చేరే విద్యార్థులకు నల్లగొండ జిల్లా నేతాపురం సర్పంచ్‌ ఆఫర్‌

తిరుమలగిరి(సాగర్‌), జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పలువురు సర్పంచ్‌లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలోని నేతాపురం సర్పంచ్‌ సర్పంచ్‌ బాసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 40 మంది విద్యార్థులందరికీ ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, సురక్షితంగా పాఠశాలకు రాకపోకలు సాగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటి పన్ను మినహాయింపు కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి తమ పిల్లలను చేర్పించాలని కోరారు.

Updated Date - Jun 24 , 2026 | 04:24 AM