Share News

kumaram bheem asifabad- ‘ప్రజావాణి’ దరఖాస్తులపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:46 PM

జిల్లాలోని ఆయా మండలకేంద్రాల్లో సమస్యలను పరిష్క రించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం లక్ష్యం గాడి తప్పుతోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఆశించిన ఫలితాలివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలు వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.

kumaram bheem asifabad- ‘ప్రజావాణి’ దరఖాస్తులపై నిర్లక్ష్యం
చింతలమానేపల్లిలో ప్రజావాణిలో దరఖాస్తులు అందజేస్తున్న ప్రజలు(ఫైల్‌)

- జిల్లాలో సగానికి పైగా పెండింగ్‌

- నాలుగైదు సార్లు తిరుగుతున్నా పట్టిని వైనం

చింతలమానేపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయా మండలకేంద్రాల్లో సమస్యలను పరిష్క రించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం లక్ష్యం గాడి తప్పుతోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఆశించిన ఫలితాలివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలు వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ప్రజలకు దూరం భారం తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజవాణి కార్యక్ర మానికి మొత్తం 3,088 దరఖాస్తులు అందాయి. ఇందులో మండల స్థాయిలో 1,230 అర్జీలు అందాయి. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తు ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తున్నా పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. దరఖాస్తుదారులు సమస్యల పరిష్కారానికి నాలుగె ౖదు సార్లు తిరుగుతున్నా పట్టింపు లేదని చెబుతున్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోవ ువారం తప్పనిసరిగా తంతుగా నిర్వహిస్తున్నారనే తప్ప ఆయా శాఖల అధికారులు అక్కడికి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను సీరియస్‌గా తీసుకోవడ లేదు. ఆగస్టు నుంచి నవంబరు మొదటి వారం వరకు 3,088 దరఖా స్తులు రాగా ఇందులో ఎన్ని పరిష్కరించారు..? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి..? ఎన్ని తిరస్కరించారు..? అనే వివరాలు అధికారులు ఇప్పటికీ వెల్లడించడం లేదు. కాగజ్‌నగర్‌కు చెందిన లెండుగురే శ్యాంరావు ఆగస్టు 31న ప్రజవాణిలో కాగజ్‌నగర్‌ కోసినిని సర్వేనంబరు 79, 80 భూమి ప్రభుత్వానికి చెందిన కాగా, ఈ భూమిలో ప్లాటింగ్‌ చేసినట్టు తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టక పోగా కనీసం ఈ సర్వే నంబర్ల వైపు రాలేదని ఫిర్యాదు దారుడు బాహా టంగా చెబుతున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారణ జరిపినట్టు కూడా అధికారులు సమాచారం కూడా ఇవ్వలేదని, కేవలం దరఖాస్తులు స్వీకరిస్తున్నారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని పలువురు చెబుతున్నారు.. ప్రభుత్వం ఆశయం బాగానే ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలని పెద్దగా దృష్టి సారించడం లేదని పలువురు ఫిర్యాదులు బాహాటంగా చెబుతున్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని, అలాంటప్పుడు ఎందుకు ప్రజావాణి కార్యక్ర మాలు చేపడుతున్నారని మండి పడుతున్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కరించడం లేదని పలువురు ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రజావాణి విభాగానికి తరలుతున్నారు. అధికారులు జాప్యంతో మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని పలువురు తెలిపారు. వదిలే యకుండా ప్రతి స్థాయిలో పరిష్కార గడువు విఽధించి నిరంతరం పర్యవేక్షిం చాలని ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదులపై అధికారులు స్పందించాలి..

-లెండుగురే శ్యాం, మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజావాణి కార్యక్రమమంలో అందే ఫిర్యాదులపై అధికారులు స్పందించాలి. ఎన్ని దరఖాస్తులు అందాయి.. వాటి విషయంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపాలి. తాను స్వయంగా ఆగస్టు 31న కోసిని సర్వేనంబరు 79,80 ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ జరుపాలని ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇంత నిర్లక్ష్యం ఉంటే ప్రజవాణి కార్యక్రమం గాడి తప్పే అవకాశం ఉంది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపితే బాగుటుంది.

Updated Date - Nov 15 , 2026 | 10:46 PM