kumaram bheem asifabad- అధికారుల నిర్లక్ష్యం..అన్నదాతలకు నష్టం
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:37 PM
కష్టపడి పండించిన పంటనే విక్రయించేందుకు రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ క్రాప్‌లో నమోదై ఉంటేనే మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు. కానీ వ్యవసాయ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సాగవుతున్న పంటలకు, నమోదవుతున్న విస్తీర్ణానికి భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి.
జైనూర్/సిర్పూర్(యు) ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కష్టపడి పండించిన పంటనే విక్రయించేందుకు రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ క్రాప్‌లో నమోదై ఉంటేనే మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు. కానీ వ్యవసాయ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సాగవుతున్న పంటలకు, నమోదవుతున్న విస్తీర్ణానికి భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. వానాకాలానికి సంబంధించి ఈ క్రాప్‌లో పంట వివరాలు సరిగా లేక రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆవస్థలు పడ్డారు. చాల మంది పేర్లు లేక వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకొని నష్ట పోయారు. జిల్లాలోని ఏజేన్సీ గ్రామాల్లో ఈ సమస్య ఎవక్కువగా ఉంటుంది. పంటలు సాగు చేస్తున్న సమయంలో అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనే వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. కానీ వారు క్షేత్ర స్థాయికి వెళ్ల లేక కార్యాలయం నుంచే వివరాలు నమోదు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొంత మంది ఏఈవోలు గ్రామాల్లో తమకు తెలిసిన వారికి పనులు అప్పగించి వారానికి రెండు, మూడు రోజులు కార్యాలయాలకు రాక పోకలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. వానాకాలం సీజనులో చాల మంది రైతుల పేర్ల మీదుగా పంట ఒకటైతే మరొ కటి నమోదైన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో రైతులు మొక్కజొన్న దాదాపు 80 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ క్రాప్‌లో మాత్రం తక్కువగా(50 వేల కంటే తక్కువ) కనిపించింది. దీంతో సాగుదారులు పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు. మరి కొందరికి తమ పేరు మీదుగా మొక్కజొన్నకు బదులుగా పత్తి నమోదైంది. జిల్లాలో ప్రస్తుతం సాగవవుతున్న యాసంగి పంటల విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటల వివరాలు, విస్తీర్ణం కచ్చితంగా నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటాం..
ఆనంద్‌రావ్, ఏవో, సిర్పూర్(యు)
పంటల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా. వానాకాలం ఈ క్రాప్ నమోదులో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో తిరిగి పంటల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇది వరకే ఏఈవోలకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. పంటల నమోదులో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటాం.