Share News

మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం సహించం

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:11 PM

జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొను గోళ్లను వేగవంతంగా, పారదర్శకంగా ని ర్వహించేందుకు ముమ్మర చర్యలు చేప ట్టిందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం సహించం
కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌తో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డిలు

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యో తి) : జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొను గోళ్లను వేగవంతంగా, పారదర్శకంగా ని ర్వహించేందుకు ముమ్మర చర్యలు చేప ట్టిందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 18 జిన్నింగ్‌ మిల్లుల్లో మొక్కజొన్నను కొనుగోలు చేసి నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార శాఖ ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి కొను గోలు ప్రక్రియను సజావుగా కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

జిల్లా అభివృద్ధికి కలిసి పని చేద్దాం

- నూతన కలెక్టర్‌తో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో క లిసి ముందుకెళ్దామని ఎమ్మెల్సీ కూచకుళ్ల దా మోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డిలు అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క లెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ను గురువారం ఆయన చాంబర్‌లో ఇరువురు ప్రజాప్రతినిధులు కలిశారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్ర సమస్యల గురించి కలెక్టర్‌తో చర్చించారు.

ప్రజాపాలన కార్యక్రమాలను

విజయవంతంగా నిర్వహించాలి

ప్రజాపాలన కార్యక్రమాలను విజయవంతం గా నిర్వహించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పా టిల్‌ అన్నారు. గురువారం సాయంత్రం గూగు ల్‌ మీట్‌ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావే శంలో మే 2వ తేదీన నిర్వహించనున్న నియో జకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా ని ర్వహించాలని కలెక్టర్‌, సంబంధిత అధికారు లకు పలు సూచనలు, సలహాలు చేశారు. కలెక్ట ర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న 99రోజుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయి సమావేశాలు విజయ వంతంగా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో ని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లా పూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ని యో జకవర్గ స్థాయి ప్రజాపాలన సభలను స మర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

జిల్లాలో విద్యా వారోత్సవాల ఘనంగా నిర్వ హిస్తామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భా గంగా అమలు చేస్తున్న 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో మే 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను జిల్లాలో ప్రణాళికబద్ధంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కా ర్యదర్శి యోగితారాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా విద్యా ధికారితో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. బడిబా ట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి తల్లి దండ్రులతో విద్యపై అవగాహన పెంపు దిశగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశం లో జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌, సెక్టోరి యల్‌ అధికారులు కిరణ్‌కుమార్‌, వెంకటయ్య, నూరుద్దీన్‌, షర్ఫుద్దీన్‌, ఈడబ్ల్యూసీ ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:11 PM