ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం
ABN , Publish Date - May 11 , 2026 | 11:36 PM
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభు త్వంతో పాటు ఎమ్మెల్యే, అధికారులు అందరి నిర్లక్ష్యం ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మండిపడ్డారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
హాజీపూర్, మే 11 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభు త్వంతో పాటు ఎమ్మెల్యే, అధికారులు అందరి నిర్లక్ష్యం ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మండిపడ్డారు. పట్టణంలోని ఆర్ అండ్‌బి గెస్టుహౌజ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వే శంలో ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తూకం వేయలేదన్నారు. ఒక ఎమ్మె ల్యే అయి ఉండి 42 నుంచి44కిలోల ధాన్యం జోకాలని చెప్పడం అంతే కాకుండా అదనంగా లారీ ట్రాన్సుపోర్టుకు రూ.2నుంచి4రైతులను ఇవ్వా లనడం సిగ్గుచేటన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు మర ణిస్తే కలెక్టర్‌ను రాకుండా అడ్డుకున్నది కూడా ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అని ఇది ఎంత వరకు న్యాయమన్నారు. రైతులు మరణించిన రోజు రూ. 50లక్షల పరిహారం ఒక్కో రైతు మరణానికి ఎక్ష్స్‌గ్రేషియా చెల్లించాలని బీ ఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం కేవలం రూ.10 లక్షలు మాత్రమే వస్తాయని చెప్పడం న్యాయమేనా అన్నారు. ఈసమా వేశంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్ పెట్టెం తిరుపతి, పార్టీ దం డేపల్లి మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనీల్, నాయకులు పాల్గొన్నారు.