Share News

kumaram bheem asifabad- విద్యారంగంపై నిర్లక్ష్యం సరికాదు

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:21 PM

విద్యారంగంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం సరికాదని భారత్‌ బచావో జాతీయ కార్యదర్శి గాదె ఇన్నయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- విద్యారంగంపై నిర్లక్ష్యం సరికాదు
: మాట్లాడుతున్న భారత్‌ బచావో జాతీయ కార్యదర్శి గాదె ఇన్నయ్య

కాగజ్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం సరికాదని భారత్‌ బచావో జాతీయ కార్యదర్శి గాదె ఇన్నయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన సిర్పూరు(టి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటు వంటి సంక్షేమ హాస్టళ్లకు నూతన పక్కా భవనాలు సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, సంక్షేమ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్టు తెలిపారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించకుండా ఒత్తిడి చేయాలని చెప్పారు. వెనుకబడిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఉన్నటు వంటి సంక్షేమ హాస్టల్‌ వసతి గృహాలకు నూతన భవనాలు మంజూరు చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో అధికారులు, నాయకులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యా య సంఘాల ప్రజాప్రతినిధులు జయదేవ్‌ అబ్రహం, రాజకమలాకర్‌రెడ్డి, నాయకులు సంతోష్‌, కొండ రాంప్రసాద్‌; మన్నెంపల్లి మల్లేష్‌, పూర్వ విద్యార్థులు కోట ఆనంద్‌, దుర్గం వినోద్‌, రాంటెంకి నవీన్‌, సూరన్న, ఇప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 10:21 PM