kumaram bheem asifabad- వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:09 PM
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో వ్యవసాయరంగాన్ని విస్మరించిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం మండలంలోని మోవాడ్ గ్రామంలో రైతుసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాలు చేసిందన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో వ్యవసాయరంగాన్ని విస్మరించిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం మండలంలోని మోవాడ్ గ్రామంలో రైతుసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాలు చేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. భూ భారతి పేరుతో పేద ప్రజల భూములకు నోటీసులు ఇచ్చి భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. రైతు వ్యతిరేక విదానాలతో రైతుల నడ్డి విరుస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని వివరించారు. రైతుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆకాష్, ఆహ్మద్, సింగిల్ విండో చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, కౌన్సిలర్లు సాలం, బాలకృష్ణ, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, పార్టీ మండల అధ్యక్షుడు జాబరి రవిందర్, నాయకులు సరస్వతి, శ్రీనివాస్, బలరాం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): గంగాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని చెప్పారు. ఇందు కోసం బీఆర్‌ఎస్ బాకీ కార్డులను తీసుకొచ్చినట్టు, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ కార్నాథం సంజీవ్ కుమార్, వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్, సర్పంచ్ భరద్వాజ్, నారాయణపూర్, సాగర్‌గౌడ్, రాజేష్, వరలక్ష్మి పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): ఎన్నిక సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు డింమాడ్ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తు బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ పిలువు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోసడం ధర్మారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు బీఆర్‌ఎస్ అధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్,మాజీ ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి,నాయకులు గేడం యశ్వంత్‌రావు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ మండల నాయకుడు అడే లక్యా నాయక్, స్థానిక సర్పంచ్ రాజశేఖర్ అన్నారు. బీఆర్‌యస్ అధిష్ఠానం పిలుపు మేరకు మండల కేంద్రాలలో ధర్న నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కిషన్ బాపురావు, అనిల్, రాహుల్, బాబులాల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.