నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ షురూ..
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:46 AM
అఖిల భారత స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం మొదలైంది. ఈ మేరకు నీట్-సూపర్ స్పెషాలిటీ ఆలిండియా కౌన్సెలింగ్ ....
ఏప్రిల్ 10 నుంచి తరగతులు ప్రారంభం
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం మొదలైంది. ఈ మేరకు నీట్-సూపర్ స్పెషాలిటీ ఆలిండియా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. విద్యార్థుల తొలి విడత కౌన్సెలింగ్ ఆన్‌లైన్ ప్రక్రియ ఈ నెల 10నుంచి ప్రారంభమైంది. 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. ఈనెల 11 నుంచి 16రాత్రి 11.50 గంటల వరకూ వెబ్ ఆప్ష న్లు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 17న కౌన్సెలింగ్ కమిటీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించి 18న తొలివిడత అడ్మిషన్ల ఫలితాలను ప్రకటిస్తుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 19 నుంచి 25లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చే యాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3 వరకూ ఉంటుంది. ఈనెల 29నుంచి ఏప్రి ల్ 4 అర్ధరాత్రి 11.55 గంటల వరకూ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయొచ్చు. వచ్చేనెల 5,6 తేదీ ల్లో కౌన్సెలింగ్ కమిటీ.. సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టి..7న ఫలితాలు వెల్లడిస్తుంది. సీట్లు పొందినవారు వచ్చే నెల 8నుంచి 16 లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలి.