Share News

kumaram bheem asifabad- ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ABN , Publish Date - May 03 , 2026 | 10:42 PM

దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులైనా యంబీబీఎస్‌, బీడీఎస్‌ ఆయుష్‌ వైద్య విద్యలో ప్రవేశాల కొసం జాతీయ స్ధాయిలో నిర్వహించే (నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజి 2026ప్రవేశ పరీక్ష) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ తనిఖీ చేశారు.

kumaram bheem asifabad- ప్రశాంతంగా ముగిసిన నీట్‌
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులైనా యంబీబీఎస్‌, బీడీఎస్‌ ఆయుష్‌ వైద్య విద్యలో ప్రవేశాల కొసం జాతీయ స్ధాయిలో నిర్వహించే (నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజి 2026ప్రవేశ పరీక్ష) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన నీట్‌ పరీక్షకు 316 మంది అభ్యర్థులు హాజు కావాల్సి ఉండగా 313 మంది హాజరైనట్లు తెలిపారు. అభ్యర్థులను అడ్మిట్‌ కార్డుతో పాటు నిబంధనల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు గల ఒరిజినల్‌ ఐడీ కార్డులతో అనుమతించామని తెలిపారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రంలోకి చేతి రుమాలు, మొబైల్‌ పోన్‌, చేతి గడియారం, బెల్టు, ఉంగరం, గొలుసు, చెవి పోగులు మొదలైన ఆభరణాలు, ఎలకా్ట్రనిక్‌ కమ్యూనికేషన్‌ పరికరాలు, పెన్ను, పెన్సిల్‌, ఎరేజర్‌, షార్పనర్‌, కరెక్షన్‌ ప్లూయిడ్‌ వంటివి అనుమతించలేదని తెలిపారు. పరీక్ష ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం రికార్డుతో పాటు పరీక్ష కేంద్రంలో 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 28 మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు చీఫ్‌ సూపరింటెండెన్స్‌లు విధులు నిర్వహించినట్లు తెలిపారు. కాగా ఆదివారం జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షకు జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు ఆర్‌ఎంపీలు హాజరయ్యారు. పట్టణానికి చెందిన కేదారి గౌడ్‌, రవికాంత్‌లు ఐదుపదుల వయసు దాటినప్పటికీ పరీక్షకు హాజరయ్యారు. వైద్య విద్య కోర్సులో ప్రవేశం పొందేందుకు నీట్‌ పరీక్ష రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Updated Date - May 03 , 2026 | 10:42 PM