Share News

kumaram bheem asifabad-అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - May 20 , 2026 | 10:15 PM

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలి, రెబ్బెన మండలం ఎక్స్‌రోడ్‌, కాగజ్‌నగర్‌ మండలం డాడానగర్‌, కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీ మిల్లు క్రీడా ప్రాంగణాన్ని బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌సీ దండే విఠల్‌, జిల్లా కలెక్టర్‌ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌ రావులతో కలిసి పరిశీలించారు.

kumaram bheem asifabad-అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
డాడానగర్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పాల్గొన్న అధికారులు

కాగజ్‌నగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలి, రెబ్బెన మండలం ఎక్స్‌రోడ్‌, కాగజ్‌నగర్‌ మండలం డాడానగర్‌, కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీ మిల్లు క్రీడా ప్రాంగణాన్ని బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌సీ దండే విఠల్‌, జిల్లా కలెక్టర్‌ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌ రావులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జిల్లాలో సభ నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇలక్షౌ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఏప్రిల్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.35లక్షల మంజూరయ్యాయని, జూన్‌ నాటికి 2.35లక్షలు ఇండ్లు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హాయంలో ఆర్బాటాలే తప్పా చేసింది ఏమీ లేదన్నారు. తమ కాంగ్రెస్‌ హాయంలో దశల వారిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సుగుణక్క, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అనీల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షహీన్‌ సుల్తాన, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగిర్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, సర్పంచిలు తదితరులు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ నికిత పంత్‌ ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీ బందోస్తు నిర్వహించారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొఠారిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబందాల, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిరులను అడిగిఇళ్లు కట్టుకున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గృహప్రవేశం చేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 2లోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచిచారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, మాజీ డీసీసీ అద్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, సర్పంచ్‌ మడావి శాంతబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 10:15 PM