city benches: పుర పీఠాలపై నజర్..!
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:45 AM
నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 17 మునిసిపాలిటీల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో అన్నింటిలో ఛైర్మన్ పదవులు గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ బరిలో దిగుతోంది.
అన్ని చైర్మన్ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్
కీలకమైన స్థానాల్లో బరిలో దిగేందుకు వామపక్షాలు సిద్ధం
ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర ంగా మునిసిపల్ పోరు
నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 17 మునిసిపాలిటీల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో అన్నింటిలో ఛైర్మన్ పదవులు గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ బరిలో దిగుతోంది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం తమ నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం అవశ్యకంగా మారింది. నియోజకవర్గాల్లో అధిక జనాభా కేంద్రీకృతమయ్యే పట్టణాలుకావడంతో ఇక్కడ గెలవడం ద్వారా తమకు ప్రజల్లో సానుకూల త ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు ఈ ఎ న్నికలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉంటే 40కిపైగా త మ అభ్యర్థులే గెలవాలనే లక్ష్యాన్ని మంత్రి వెంకటరెడ్డి పార్టీ నగర క్యాడర్‌కు సూచించడం కార్పొరేషన్ గెలుపుని ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని తెలియజేస్తోంది. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం తాజాగా జరిగిన నియోజకవర్గ పర్యటనలో మునిపిపోల్స్‌లో తామే విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సైతం వారి పరిధిలోని అన్ని మునిసిపాలిటీల్లో 80శాతం కౌన్సిలర్ల స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో మంచి పేరుకలిగి, ఆర్థికంగా, సామాజికపరంగా కలిసొచ్చే నాయకులను కౌన్సిలర్లుగా నిలబెట్టే లక్ష్యంతో అభ్యర్థులను గుర్తిస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటిస్తే వెంటనే అభ్యర్థులను ప్రకటించేలా వార్డులవారీగా క్యాండెట్లను గుర్తించారు. నల్లగొండలో కార్పొరేటర్లుగా, మునిసిపాల్టీల్లో కౌన్సిలర్లుగా పోటీచేయాలని తహతహలాడుతున్న నాయకులు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడించి వార్డుల్లో పర్యటిస్తున్న పరిస్థితి మొదలైంది.
పురపోరులో వికసిస్తామనే విశ్వాసంలో కమలదళం..
పట్టణప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మునిసిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు, అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలపాలని ప్రాథమికంగా నిర్థారించారు. ఇప్పటికే ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టారు. మునిసిపల్ ఎన్నికల్లో ఏపార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాచందర్‌రావు సైతం స్పష్టం చేయడంతో క్యాడర్ పోటీకి సిద్ధమవుతోంది. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి మునిసిపాల్టీల్లో గతంలోనే తమ పార్టీ గెలుపొందిందని, ఈసారి మునిసిపల్ పోరులో గత చరిత్రను రిపీట్ చేయడమేకాకుండా, ఉమ్మడి జిల్లాలో ఊహించనిరీతిలో ఫలితాలు సాధిస్తామని పార్టీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. రిజర్వేషన్లు వెలువడిన తక్షణమే అభ్యర్థులను ప్రకటించేలా ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తిచేసినట్లు చెబుతున్నారు.
కాంగ్రె్‌సకు ధీటుగా బీఆర్‌ఎస్ వ్యూహం
ఉమ్మడి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులతో బరిలో దిగి కాంగ్రె్‌సకు ధీటైన పోటీ ఇవ్వాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఈమేరకు పార్టీ మునిసిపాలిటీల క్యాడర్‌కు దిశానిర్థేశం చేస్తున్నారు. ప్రతీ వార్డులోనూ బలమైన అభ్యర్థిని బరిలో దించడమే కాకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. పట్టణప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మునిసిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు, అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్థారించారు.
కీలకమైన స్థానాల్లో పోటీకి వామపక్షాలు రెడీ
ఉమ్మడి జిల్లాలో క్యాడర్, ఓటుబ్యాంకు కలిగిన సీపీఎం, సీపీఐ ఈ మునిసిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. సీపీఎం, సీపీఐ పొత్తు కొనసాగిస్తూ మునిసిపాల్టీల వారీగా కలిసొచ్చే ప్రధాన పార్టీలతో సీట్లసర్దుబాటును కొనసాగిస్తూ తమ ఓటుబ్యాంకు కలిగిన వార్డుల్లో బరిలో నిలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు.