kumaram bheem asifabad- గ్రామీణ విద్యార్థులకు నవోదయ గొప్ప అవకాశం
ABN , Publish Date - Aug 04 , 2026 | 10:40 PM
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ పాఠశాల గొప్ప అవకాశంలాంటిదని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. డీఈవో కార్యాలయం ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు నవోదయ పాఠశాల ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు గొప్పగా ఉండడం పేద విద్యార్థులకు కలిసి వచ్చే ఆంశమని వివరించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ పాఠశాల గొప్ప అవకాశంలాంటిదని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. డీఈవో కార్యాలయం ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు నవోదయ పాఠశాల ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు గొప్పగా ఉండడం పేద విద్యార్థులకు కలిసి వచ్చే ఆంశమని వివరించారు. వారిలోని ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉన్నదని చెప్పారు. నవోదయ విద్యాలయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ కృష్ణ మాట్లాడుతూ 1986లో ప్రారంభమైన జవహర్ నవోదయ పాఠశాల ఎంతో మంది విద్యార్థులను ఉన్నతశ్రేణిలో నిలిపిందని వివరించారు. పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఏడుగురు సివిల్ సర్వీసులో ఎంపికైనట్లు చెప్పారు. బుధవారం నవోదయ పాఠశాల 39వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హజరై విజయవంతం చేయలని కోరారు. సమావేశంలో పాఠశాల పీజీటీ రామయ్య, పేరేంట్ కమిటీ సభ్యుడు ఊశన్న తదితరులు పాల్గొన్నారు.