kumaram bheem asifabad- ప్రశ్నార్థకంగా ప్రకృతి సేద్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:58 PM
రసాయన ఎరువుల, పురుగు మందులు వాడాకుండా సహజ విధానంలో సాగును ప్రోత్సహించేలా కేంద్ర జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ అధికారులు ఆసక్తి కలిగిన రైతులను ఎంపిక చేసి జీవామృతం, బీజామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీకి బయో రీసోర్స్(బీఆర్‌ఎస్) కేంద్రాలను మంజూరు చేశారు. ఒక్కొ కేంద్రానికి అవసరమైన వస్తువులు, సామాగ్రి కొనుగోలు కోసం రూ.లక్ష చొప్పున జిల్లా వ్యవసాయ శాఖ తరపున ఏజేన్సీకి అందించారు. ఐదు నెలల గడుస్తున్నా నిర్వాహకులు ఎలాంటి సామగ్రి పంపిణీ చేయక పోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రసాయన ఎరువుల, పురుగు మందులు వాడాకుండా సహజ విధానంలో సాగును ప్రోత్సహించేలా కేంద్ర జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ అధికారులు ఆసక్తి కలిగిన రైతులను ఎంపిక చేసి జీవామృతం, బీజామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీకి బయో రీసోర్స్(బీఆర్‌ఎస్) కేంద్రాలను మంజూరు చేశారు. ఒక్కొ కేంద్రానికి అవసరమైన వస్తువులు, సామాగ్రి కొనుగోలు కోసం రూ.లక్ష చొప్పున జిల్లా వ్యవసాయ శాఖ తరపున ఏజేన్సీకి అందించారు. ఐదు నెలల గడుస్తున్నా నిర్వాహకులు ఎలాంటి సామగ్రి పంపిణీ చేయక పోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 16 బీఆర్‌ఎస్‌లను మంజూరు చేశారు. ఒక్కొ దానికి రూ.లక్ష చొప్పున కేటాయించారు. వీటికి కేంద్రాలకు అవసరమైన రిఫ్రిజిరేటర్, డ్రమ్ములు, గుంజులు, పిండగి గిర్నీ, స్టిర్రర్, ప్యాకింగ్ యంత్రం వంటి వాటి సరఫరా కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఏజెన్సీని నియమించింది.
- సెర్ప్ ఆదేశాలతో..
సెర్ప్ ఆదేశాలతో జిల్లా వ్యవసాయ శాఖ తరుపున ఏజేన్సీకి గత మార్చి 31కి ముందే రూ.16 లక్షలు చెల్లించినా, సామగ్రిని సరఫరా చేయలేదు. జిల్లాలో రెండో విడత 2026-27కు సంబంధించిన మరో 11 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లకు సంబంధించిన ప్రకృతి సేద్యానికి జిల్లాకు రూ.3 కోట్లకుపైగా కేటాయించారు. జిల్లాలో 24 క్లస్టర్లకు ఏర్పాటు ఒక్కొక్క దానిలో 125 మంది రైతుల చొప్పున మొత్తం మూడువేల మందిని ఎంపిక చేశారు. వీరికి శిక్షణలు, అవగాహన కల్పించేందుకు ఒక్కొ క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున 48 మంది కృషి సఖీలను నియమించారు. వీరికి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. రైతులకు సేంద్రియ ఎరువులు, రసాయనాల కొనుగోళ్లకు రూ.4వేల చొప్పున అందిస్తున్నారు. ఇప్పటికే 2చ700 మందికి సంబంఽధించి రూ.2వేల చొప్పున రూ.55 లక్షల నిధులను ట్రేజరీలో జమ చేశారు. సేంద్రియ ఎరువుల తయారీకి ప్రకృతి వ్యవసాయం చేసే మహిళ సంఘం సభ్యులకు బయో రీసోర్స్ కేంద్రాలను కేటాయించారు. ఖరీఫ్ సీజన్ ముగిసేందుకు వస్తున్నా జిల్లాలో ఇంకా తయారీ కేంద్రాల ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌ను వివరణ కోరగా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. త్వరలోనే సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.