Share News

డాలస్‌లో 2027 నాట్స్‌ సంబరాలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:49 AM

2009లో ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) 9వ అమెరికా తెలుగు సంబరాలు 2027లో డాలస్‌లో నిర్వహించనున్నారు. ఈనెల 7న (శనివారం) డాలస్‌లో స్థానిక ప్రవాసాంధ్రులతో...

డాలస్‌లో 2027 నాట్స్‌ సంబరాలు

(డల్లాస్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

2009లో ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) 9వ అమెరికా తెలుగు సంబరాలు 2027లో డాలస్‌లో నిర్వహించనున్నారు. ఈనెల 7న (శనివారం) డాలస్‌లో స్థానిక ప్రవాసాంధ్రులతో 2026-27 నాట్స్‌ కార్యవర్గం మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఏర్పాటు చేశారు. అమెరికావ్యాప్తంగా ఉన్న నాట్స్‌ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్స్‌ బోర్డు చైర్మన్‌గా నియమితులైన కంచర్ల నందకిషోర్‌ మాట్లాడుతూ.. 2013, 2019లో డల్లా్‌సలో సంబరాలు నిర్వహించామని, వచ్చే ఏడాది తిరిగి డాలస్‌లో ఈ వేడుకలు జరుపుకోనుండడం ఆనందంగా ఉందన్నారు. నాట్స్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను ఆటా, తానా, టాంటెక్స్‌ సంస్థల ప్రతినిధులు సత్కరించారు. నాట్స్‌ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ.. నాట్స్‌ను త్వరలో 50రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. సలహామండలి సభ్యుడు డా.కొత్తా శేఖరం మాట్లాడుతూ.. అమెరికాలోని తెలుగువారికి సేవ చేయాలనే సదుద్దేశంతో మాదాల రవి, నాదెళ్ల రణకుమార్‌ తదితరులు నాట్స్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

Updated Date - Mar 09 , 2026 | 03:49 AM