kumaram bheem asifabad- ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:09 PM
జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్వజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
తిర్యాణి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్వజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తిర్యాణి మండలంలోని జడ్పీ పాఠశాలలో అస్పరేషన్ బ్లాక్‌లో భాగంగా శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రయోగాలను ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఏబీపీ ఫెలో డాక్టర్ బాలరాజులు ముఖ్య అతిథిగా హాజరై ప్రయోగాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్ మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ ప్రయోగాలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో అంజయ్య, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ఉపన్యాస పోటీసులు, సైన్స్ ప్రదర్శణలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలే విద్యాలయంలో శనివారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలతో కూడిన వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. సైన్స్ అనేది విద్యార్థుల్లో నిత్య జీవితంలో ఒక భాగమని భవిష్యత్‌లో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ కనబర్చిన వారికి ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఓం ప్రకాష్, వసంత్, శ్రీనివాస్, మౌనిక, సునీత తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా న్విహించారు. ఈ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల చేత విజ్ఞాన ప్రదర్శన చేపట్టారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధా ్యయుడు విజయనిర్మల, ఉపాధ్యాయులు యాదగిరి, భారతి, భాగ్యశ్రీ, ఉజ్వల, ఆత్మారాం, గంగాభవాని, సమ్మయ్య, సంతోష్, లక్ష్మి, నాగరాణి, విజయ, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి,(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పదం పెంపొందించాలని ఎస్సై మహేందర్ అన్నారు. శనివారం స్థానిక గ్రీన్ వుడ్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధి ప్రతిభింబించే ప్రదర్శనలను తిలకించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై పోస్టర్లు, చార్ట్‌లు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చక్రపాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆత్రం దత్తు, సీనియర్ ఉపాధ్యాయుడు భూమన్న, శ్రీనివాస్, భీంరావు, ఉర్వెత మోహన్‌రావు, కవిత, స్వప్నతదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావ్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో నాయకుడు మేస్రాం అంబాజీరావ్, హెచ్‌ఎం పార్వతీబాయి తదితరులు పాల్గొన్నారు.