kumaram bheem asifabad- జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:02 PM
జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన వెంకటేష్ దోత్రే నీతి ఆయోగ్‌లో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చారని ప్రస్తుత కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారం విద్యా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతిపై వెళ్తున్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌లతో కలిసి వెంకటేష్ దోత్రేను సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
ఆసిఫాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన వెంకటేష్ దోత్రే నీతి ఆయోగ్‌లో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చారని ప్రస్తుత కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారం విద్యా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతిపై వెళ్తున్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌లతో కలిసి వెంకటేష్ దోత్రేను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో అధికారుల సమన్వయంతో నీతి అయోగ్ కార్యక్రమాన్ని మంచి ర్యాంకు సాధించి జిలాలకు గుర్తింపు తీసుకు వచ్చారని తెలిపారు. ఇదే స్పూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందు వరుసలో ఉంచుదామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భత్రల అదుపులో ఉంచడంతో పాటు సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పని చేశారని తెలిపారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో 23 నెలల పాటు కలెక్టర్‌గా పని చేసిన సమయంలో అధికారులు అందించిన సహకారంతో పార్లమెంట్, శాసన మండలి, సర్పంచ్ ఎన్నికలు, భారీ వర్షాల సమయంలో ప్రజారక్షణ చర్యలు చేపట్టడంలో ఇతర సంఘటనలను నియంత్రించడంలో విజయవంతంగా పని చేశామని తెలిపారు. ఆదివాసీలకు అండగా అదికారులు పని చేయాలని, ఆసిఫాబాద్ అనే పేరు తన మనసులో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి
రెబ్బెన, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరగనున్న బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హరిత అన్నారు. గంగాపూర్ గ్రామాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. జాతర మహోతసవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, సర్పంచ్, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో భక్తుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. తాగునీరు, పారిశుఽ ద్యం, వాహనాల పార్కింగ్, దుకాణ సముదాయాలు, బారీ కేడ్లు ఏర్పాట్లను పకడ్బం దీగా చేపట్టాలని తెలిపారు. జాతరలో ప్రముఖుల సందర్శన, అత్యవసర సేవలు నిమిత్తం అంబులెన్స్, ఇతర పూర్తి ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
ఆసిఫాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల హెచ్ విభాగ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఉద్యోగులు, అధికారులు సమయపాలన పాటించాలని అన్నారు.. నిబద్దతతో, క్రమ శిక్షణతో పని చేయాలని చెప్పారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.