17న నేషనల్ మొబిలిటీ సమ్మిట్: పొన్నం
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:58 AM
రవాణా రంగం అభివృద్ధి, విద్యుత్ వాహనాలు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రవాణా రంగం అభివృద్ధి, విద్యుత్ వాహనాలు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి రవాణా శాఖ కమిషనర్, ఇతర కీలక అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 17న హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో 2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో రవాణా రంగం, స్మార్ట్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, నగర రవాణా అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎలేట్స్ టెక్నోమీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ ముఖ్య భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు.