Share News

విదేశీ వైద్య విద్యకు నిబంధనలు కఠినం

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:07 AM

గతంతో పోలిస్తే ఉన్నత విద్యావకాశాలు మెరుగయ్యాయి. ప్రైవేటు/విదేశీ యూనివర్సిటీలు, విదేశీ కాలేజీల్లో ఉన్నత విద్యనభ్యసించవచ్చు.

విదేశీ వైద్య విద్యకు నిబంధనలు కఠినం

  • ఆన్‌లైన్‌ తరగతులకు ఎన్‌ఎంసీ నో

  • 2018 తర్వాత విదేశీ మెడికోలుు ఏడాది ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిందే..

హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): గతంతో పోలిస్తే ఉన్నత విద్యావకాశాలు మెరుగయ్యాయి. ప్రైవేటు/విదేశీ యూనివర్సిటీలు, విదేశీ కాలేజీల్లో ఉన్నత విద్యనభ్యసించవచ్చు. ప్రత్యేకించి ఎంబీబీఎ్‌సలో దేశీయంగా అడ్మిషన్‌ పొందాలంటే ‘నీట్‌’లో మెరుగైన ర్యాంకు రావాలి. అలా ర్యాంకు రాని వారు ఉక్రెయిన్‌, ఫిలిఫ్ఫైన్స్‌, రష్యా తదితర దేశాల్లోని యూనివర్సిటీలు, వైద్య విద్య కాలేజీల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. అయితే, కరోనా సమయంలోనూ, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా విదేశీ వర్సిటీల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులు.. ఒక విద్యాసంవత్సరం అంతా ఆన్‌లైన్‌లోనే సబ్జెక్టులు చదువుకున్నారు. అలా ఆన్‌లైన్‌లో నేర్చుకున్న అంశాలన్నీ తదుపరి ఆఫ్‌లైన్‌లో పూర్తి చేశారని చదువుల కాలం పెంచకుండా మెడికోలు ధ్రువీకరణ పత్రాలివ్వడం నిబంధనలకు విరుద్ధమని జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) పేర్కొంది. వైద్యవిద్యలో నేరుగా నేర్చుకోవడం (ప్రాక్టీస్‌), శిక్షణ, రోగులకు చికిత్సానుభవం చాలా ప్రాధాన్యం ఉంటాయి. కనుక ఆఫ్‌లైన్‌లో వైద్యవిద్యాబోధనను, ఆన్‌లైన్‌ బోధనను సమానంగా పరిగణించలేమని ఎన్‌ఎంసీ తాజాగా తేల్చి చెప్పిం ది.


విదేశీ వర్సిటీలు/కాలేజీల్లోని వైద్యవిద్య కోర్సుల తీరు, మెడిసిన్‌ చదివే సంవత్సరాలు, వాటిలోని పాఠ్యాంశాలు.. భారత్‌లోని ఎంబీబీఎస్‌ కోర్సుతో సమానంగా ఉండాలని, కోర్సులో తగినంత క్లినికల్‌ శిక్షణ ఉండాలని పేర్కొంది. ఆయా విదేశీ యూనివర్సిటీలు, విదేశీ వైద్యవిద్య కళాశాలల ట్రాన్ర్క్సి్‌ప్టలను ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ధ్రువీకరించాలని వివరించింది. లేని పక్షంలో ఆయా వర్సిటీల నుంచి సంపాదించిన మెడికోల విద్యార్హతలు భారత్‌లో గుర్తింపునకు నోచుకోవడం కష్టమని హెచ్చరించింది. విదేశీ వైద్యవిద్య కళాశాలలు ఇచ్చే కంపెన్సేషన్‌ సర్టిఫికెట్‌లో ఎన్ని రోజులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు? ఏయే సబ్జెక్టులు చదివారు? ప్రత్యక్షంగా పొందిన శిక్షణ తదితర వివరాలు స్పష్టంగా ఉండాలని ఎన్‌ఎంసీ సూచించింది. 2021 నవంబరు 18 తర్వాత విదేశీ వైద్యవిద్య యూనివర్సిటీలు, వైద్య కళాశాలల్లో అడ్మిషన్‌ పొందిన భారత విద్యార్థులు దేశంలో ఏడాదిపాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. స్ర్కీనింగ్‌ టెస్టు, ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ఎన్‌ఎంసీ పేర్కొంది.

Updated Date - Mar 08 , 2026 | 06:08 AM