Share News

జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,44,251 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:26 AM

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్ధాయిలో 1,44,251 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,44,251 కేసుల పరిష్కారం

హైదరాబాద్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్ధాయిలో 1,44,251 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. మొత్తం 4,627 సైబర్‌ నేరాల కేసులను పరిష్కరించి బాధితులకు రూ.24.91కోట్ల నగదు వాపసు చేశామని చెప్పారు. కేసుల పరిష్కారంలో 15,719 కేసులతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ తొలి స్ధానంలో ఉందన్నారు. మరోవైపు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 53,434మంది బాధితులకు రూ.399.06కోట్లు రీఫండ్‌ చేయించామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు.

Updated Date - Mar 30 , 2026 | 05:26 AM