Share News

జాతీయ వైద్య విధానం ప్రపంచానికే ఆదర్శం

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:55 PM

భారతీయ వైద్య విధానం ప్రపంచానికే ఆదర్శమని కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ప్రపంచ హోమియోప తి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన ఉచిత యోగా ఆయుష్‌ వైద్య శిబిరానికి ఆయన హాజరై మా ట్లాడారు.

జాతీయ వైద్య విధానం ప్రపంచానికే ఆదర్శం
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : భారతీయ వైద్య విధానం ప్రపంచానికే ఆదర్శమని కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ప్రపంచ హోమియోప తి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన ఉచిత యోగా ఆయుష్‌ వైద్య శిబిరానికి ఆయన హాజరై మా ట్లాడారు. భారతీయ వైద్య వ్యవస్థలో హోమియో, ఆయుర్వేదం, యునాని, యోగా వంటి అనేక పద్ధతుల్లో వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. కీళ్లనొప్పులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి, న్యాచురుపోతి యోగా వంటి విధానాల ద్వారా నియంత్రించవ చ్చన్నారు. ప్రజాపా లన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజల ఆరోగ్యం దృష్య్టా పారిశుధ్య్ద కార్యక్ర మాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 10:59 PM