త్వరలో జాతీయ కోల్ ఎక్చ్సేంజ్: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:27 AM
థర్మల్ కేంద్రాలు తమకు నచ్చిన చోట, నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వీలుగా జాతీయ కోల్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ...
థర్మల్ కేంద్రాలు తమకు నచ్చిన చోట, నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వీలుగా జాతీయ కోల్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ మార్కెట్‌లో నిలబడాలంటే, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని తక్కువ ధరకే బొగ్గును విక్రయించాలని ఆయన సూచించారు. ఢిల్లీ నుంచి సింగరేణితో పాటు దేశంలోని పలు బొగ్గు కంపెనీల అధికారులతో కిషన్‌రెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించి, ఇంధన రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి చేయడంపై దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే క్రమంలో కొత్త గనులు కూడా దక్కించుకోవాలని సూచించారు.