బీసీల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:24 AM
బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు జాతీయ బీసీదళ్ విజ్ఞప్తి చేసింది.
సీఎస్‌కు జాతీయ బీసీదళ్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు జాతీయ బీసీదళ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శనివారం సీఎ్‌సను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం సీఎ్‌సను ఆయన సన్మానించారు. పలు అంశాలపై సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు కుమారస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్లు చెప్పారు. వాటిపై సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సీఎ్‌సను కలిసిన వారిలో కుమారస్వామితో పాటు యాదవ సంఘం కార్యదర్శి మణికంఠేశ్వర యాదవ్, వెంకట్ ఉన్నారు.