Share News

జేఈఈ మెయిన్‌లో నారాయణ ప్రభంజనం

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:20 AM

జేఈఈ మెయిన్‌-2026 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25 వంటి 10లోపు 1, 25లోపు 8 ర్యాంకులతో...

జేఈఈ మెయిన్‌లో నారాయణ ప్రభంజనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌-2026 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25 వంటి 10లోపు 1, 25లోపు 8 ర్యాంకులతో పాటు 100లోపు 24 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డా. పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో తమ్మిన గిరీష్‌ 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇదే క్యాటగిరీలో పై ర్యాంకులతో పాటు 27, 27, 29, 32, 37, 40, 40, 44, 56, 61, 64, 66, 73, 74, 76, 97 వంటి 100లోపు 24 ర్యాంకులు, 1,000లోపు 160 ర్యాంకులతో నారాయణ విజయ ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించిందని తెలిపారు. వీరిలో అత్యధికులు నారాయణ స్కూల్‌ విద్యార్థులే కావడం గమనార్హమన్నారు. ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 1,1,6,7,9,10 వంటి 10లోపు 6ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100లోపు 48 ర్యాంకులు, 1,000లోపు 750 ర్యాంకులను నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో ఓపెన్‌ క్యాటగిరీలో 3 సార్లు (2020, 2021, 2025) ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించడం నారాయణ అంకితభావానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ సాధించినవారు 26మంది ఉండగా వారిలో ఏడుగురు (27ు) నారాయణ విద్యార్థులేనని తెలిపారు. 8రాష్ట్రాల్లో (తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌) నారాయణ విద్యార్థులే టాపర్స్‌గా నిలిచారన్నారు. ఆలిండియా బాలికల విభాగంలో విద్యార్థిని మల్లవరపు ఆస్నా ఫస్ట్‌ ర్యాంకు సాధించిందని తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 04:21 AM