Share News

‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:41 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.

‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. ఫస్టియిర్‌ ఎంపీసీలో తమ విద్యార్థులు కే.సాయిగౌతమ్‌, జి.వరీణ్య 469 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారని ఓ ప్రకటన చేశారు. సెకండియర్‌ ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారని, బైపీసీలో ముగ్గురు విద్యార్థులు 994 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఫస్టియిర్‌లో 16 మంది 468, 19 మంది 467, 40 మంది 466, 28 మంది 465 మార్కులు సాధించారని తెలిపారు. సెకండియర్‌లో ఐదుగురు 996, పది మంది 995, 29 మంది 994, 71 మంది 993 మార్కులు సాధించి సత్తా చాటారన్నారు. తెలంగాణలో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారని పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 05:42 AM