Share News

Narayana Educational Institutions: తెలంగాణలో 10 కొత్త క్యాంప్‌సలు ప్రారంభం

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:40 AM

ప్రముఖ విద్యాసంస్థ ‘నారాయణ’ తెలంగాణలో కొత్తగా 10 క్యాంప్‌సలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్‌ పునీత్‌ కొత్తప తెలిపారు.

Narayana Educational Institutions: తెలంగాణలో 10 కొత్త క్యాంప్‌సలు ప్రారంభం

  • నారాయణ విద్యా సంస్థల ప్రెసిడెంట్‌ పునీత్‌ కొత్తప

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యాసంస్థ ‘నారాయణ’ తెలంగాణలో కొత్తగా 10 క్యాంప్‌సలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్‌ పునీత్‌ కొత్తప తెలిపారు. ఇందులో 5 జూనియర్‌ కళాశాలలు, 5 పాఠశాలలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డిలో ఈ నూతన క్యాంప్‌సలు ప్రారంభించామన్నారు. ఈ విస్తరణతో రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థల మొత్తం క్యాంప్‌సల సంఖ్య 244కు చేరుకుందని వివరించారు. కొత్తగా ప్రారంభించిన క్యాంప్‌సల్లో నిజామాబాద్‌లోని పాఠశాల మినహా మిగతా అన్ని క్యాంప్‌సలు స్టేట్‌ బోర్డు సిలబ్‌సను అనుసరిస్తాయని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి పర్సనలైజ్డ్‌ మెంటరింగ్‌, అత్యాధునిక డిజిటల్‌ టూల్స్‌, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా శిక్షణ ఇవ్వడమే నారాయణ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నారాయణ క్యాంపస్‌ ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని పునీత్‌ కొత్తప తెలిపారు. విద్యార్ధుల ఎదుగుదలలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో కీలకమని నారాయణ భావిస్తుందన్నారు. అందుకే ప్రతి ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కలల్ని సాకారం చేయడమే నారాయణ విద్యాసంస్థల ధ్యేయమని పునీత్‌ కొత్తప పేర్కొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:40 AM