విజయవాడలో త్వరలో తలసేమియా కేర్ సెంటర్
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:51 AM
విజయవాడలో త్వరలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు.
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో త్వరలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. దేశవ్యాప్తంగా తలేసమియా బాధితులు ఎక్కడ ఉన్నా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వారికి సాయం అందిస్తామని చెప్పారు. నారా భువనేశ్వరి తన పుట్టిన రోజును సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌లో తలేసమియా బాధిత పిల్లలతో జరుపుకొన్నారు. కేక్ కోసి వారికి చాక్లెట్‌లు, గిఫ్ట్ హాంపర్లను పంచిపెట్టారు. వారితో కలిసి భోజనం చేశారు. ‘నా పుట్టిన రోజును తలేసమియా కేర్ సెంటర్‌లోని పిల్లల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ బాధితుల కోసం ఉచిత రక్తమార్పిడితో పాటు మందులు అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది.’ అని భువనేశ్వరి వివరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, సీవోవో అడుసుపల్లి గోపి, హెరిటేజ్ హోల్‌టైమ్ డైరెక్టర్ డా.ఎం. సాంబశివరావు పాల్గొన్నారు.