Share News

ఎస్‌ఎల్‌బీసీ కాలువలో పడి ఇరిగేషన్‌ ఈఈ మృతి

ABN , Publish Date - May 05 , 2026 | 03:54 AM

క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) ప్రమాదవశాత్తు ఎస్‌ఎల్‌బీసీ కాలువలో పడి మృతిచెందారు.

ఎస్‌ఎల్‌బీసీ కాలువలో పడి ఇరిగేషన్‌ ఈఈ మృతి

  • క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా ప్రమాదం

  • నల్లగొండ జిల్లా చందనపల్లిలో ఘటన

నల్లగొండ క్రైం, మే 4(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) ప్రమాదవశాత్తు ఎస్‌ఎల్‌బీసీ కాలువలో పడి మృతిచెందారు. సోమవారం నల్లగొండ జిల్లా శివారు చందనపల్లిలో ఈ ఘటన జరిగింది. నల్లగొండలోని రవీంద్రనగర్‌కు చెందిన మద్దెపూరి సతీష్ చంద్ర (52) ఎస్‌ఎల్‌బీసీ ఇరిగేషన్‌ విభాగంలో ఈఈగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం చం దనపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌బీసీ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సతీష్ చంద్ర మృతదేహాన్ని వెలికితీశారు. సతీష్ చంద్ర భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు. సతీష్ చంద్ర కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - May 05 , 2026 | 03:54 AM