మాతృభాష అమలుపై ఆంగ్లంలో నివేదిక..
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:35 AM
మాతృభాష అమలు తీరుపై సమాచార హక్కు చట్టం కింద నివేదిక కోరిన దరఖాస్తుదారుడికి.. నల్లగొండ డీఈఓ ఆంగ్లంలో వివరాలు అందజేశారు.
నల్లగొండ డీఈవోకు రూ.5వేల జరిమానా
నల్లగొండటౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మాతృభాష అమలు తీరుపై సమాచార హక్కు చట్టం కింద నివేదిక కోరిన దరఖాస్తుదారుడికి.. నల్లగొండ డీఈఓ ఆంగ్లంలో వివరాలు అందజేశారు. దీంతో ఆయనపై రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. నల్లగొండ పట్టణంలోని ఎంవీఆర్ పాఠశాల విద్యార్థి కన్నెకంటి కార్తిక్ జిల్లాలో మాతృభాష అమలు తీరుపై వివరాలు కోరుతూ 2025 ఆగస్టు 15న ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాడు. సమాచారం ఇవ్వాల్సిన డీఈవో భిక్షపతి దాన్ని ఇంగ్లి ష్‌లో ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ విద్యార్థి తండ్రి క్రాంతికుమార్ అదే ఏడాది సెప్టెంబరు 9న రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మంగళవా రం డీఈఓకు రూ.5వేల జరిమానా విధించారు. దీన్ని రెండు రోజుల్లో పిటిషనర్‌కు చెల్లించాలని, అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు.