ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:52 AM
తెలంగాణ ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా రామడుగు మనోహర్, కోశాధికారిగా సిద్ధి నాగరాజు లను ఎన్నుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా రామడుగు మనోహర్, కోశాధికారిగా సిద్ధి నాగరాజు లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ డీలర్లతోపాటు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సంఘం పూర్వ అధ్యక్షుడు నీలగిరి హనుమంతరావు, వివిధ జిల్లాల నాయకులు రవీందర్‌రెడ్డి, మల్లేశం, జలంధర్, నాగరాజు, సత్యనారాయణరెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రామబ్రహ్మం, నాగేశ్వరరావు, నాగేందర్, మునాఫ్ పాల్గొన్నారు.