విద్యుత్ సరఫరా అవుతున్నా పోల్ ఎక్కించిన లైన్‌మన్
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:12 AM
సబ్‌స్టేషన్‌కు మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతున్నా మరమ్మతులు చేపట్టడంతో విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సబ్‌స్టేషన్‌కు మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతున్నా మరమ్మతులు చేపట్టడంతో విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కొల్లాపుర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన మినుగు వెంకటేశ్ (35) కొంతకాలంగా విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపు, తీగలు సవరించడం తదితర పను లు చేపట్టారు. ఈ క్రమంలో జంపర్ మార్చేందుకు వెంకటేశ్‌ను విద్యుత్ లైన్‌మన్ స్తంభం మీదకు ఎక్కించారు. అప్పటికే విద్యుత్ సరఫ రా అవుతుండడంతో అతడు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయా డు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.