సాగర్‌లో సరిపడా నీటి నిల్వల్లేవు
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:07 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాల కోసం 65.49 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం కనీస నీటిమట్టానికి....
ప్రభుత్వానికి నాగార్జునసాగర్ అధికారుల లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాల కోసం 65.49 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం కనీస నీటిమట్టానికి (ఎండీడీఎల్)పైన 51.09 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన నీటి నిల్వ ఉండేలా చూడాల్సిన అవసరం కచ్చితంగా ఉందని పేర్కొంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 537.30 అడుగుల మేర 182.75 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా.. కనీస నీటిమట్టమైన 510 అడుగుల పైన 51.09 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు ఎస్‌ఈ బీవీ మల్లికార్జునరావు లేఖలో పేర్కొన్నారు.