సాగర్ ప్రాజెక్టు పూడికపై కేంద్రానికి నివేదిక తొలగించకుంటే ముప్పే: సీడీఎస్ఈ చైర్మన్ దేవేంద్రకుమార్
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:15 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గ్యాలరీల్లోని(స్పిల్‌వే వెనుక ప్రదేశం) పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియంను ఆధునిక పద్ధతిలో ...
నాగార్జునసాగర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్ ప్రాజెక్టు గ్యాలరీల్లోని(స్పిల్‌వే వెనుక ప్రదేశం) పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియంను ఆధునిక పద్ధతిలో తొలగించకుంటే ప్రాజెక్టుకు ముప్పు తప్పదని సమగ్ర డ్యాం భద్రత అంచనా(సీడీఎస్ఈ) చైర్మన్ దేవేంద్రకుమార్‌శర్మ చెప్పారు. సీడీఎ్‌సఈమరో ఇద్దరు సభ్యులు, ప్రాజెక్టు అధికారులతో కలిసి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ గ్యాలరీలను, స్పిల్‌వేను ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేంద్రకుమార్‌శర్మ మాట్లాడుతూ గ్యాలరీల్లోని పోరస్ హోల్స్‌లో కాల్షియం పేరుకుపోవడంతో సీపేజీ (ఊట నీరు) తక్కువగా వస్తున్న విషయాన్ని గుర్తించి నమోదు చేసుకున్నామన్నారు. పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఆధునిక పద్ధతిలో తొలగించకుంటే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. స్పిల్‌వేపై పడిన గుంతలను పూడ్చివేయడానికి ఆధునికపద్ధతిలో మరమ్మతులు చేపట్టాలని సూచించారు.