Share News

నాగర్‌కర్నూల్‌లో ఒకే రోజు 10 వేల కోళ్ల మృతి

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:22 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పౌల్ట్రీ రైతులను అంతుచిక్కని వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. ఒకేరోజు 10 వేల కోళ్లు మరణించడం కలకలం రేపుతోంది. ా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని....

నాగర్‌కర్నూల్‌లో ఒకే రోజు 10 వేల కోళ్ల మృతి

నాగర్‌కర్నూల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పౌల్ట్రీ రైతులను అంతుచిక్కని వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. ఒకేరోజు 10 వేల కోళ్లు మరణించడం కలకలం రేపుతోంది. ా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో 5 వేల కోళ్లు చనిపోగా, నాగర్‌కర్నూల్‌ మండలంలోని రాంరెడ్డిపల్లి తండాలో 1500, మిగతా ప్రాంతాల్లో సుమారు 4 వేల వరకు కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ పరిణామంతో చిన్న రైతులు లబోదిబోమంటున్నారు. కోళ్లకు సోకిన వైర్‌సపై పూర్తి స్థాయిలో పరిశోధన జరిపేందుకు సోమవారం నాడు ఫోరెన్సిక్‌ నిపుణులు నాగర్‌కర్నూల్‌కు రానున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 04:22 AM