Share News

ముగిసిన నాదెండ్ల భాస్కరరావు అంతిమ సంస్కారాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:53 AM

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అంతిసంస్కారాలు గురువారం ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో...

ముగిసిన నాదెండ్ల భాస్కరరావు అంతిమ సంస్కారాలు

  • నివాళులర్పించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 23(ఆంద్రజ్యోతి): ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అంతిసంస్కారాలు గురువారం ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పలుపార్టీల నాయకులు సుజనాచౌదరి, సుబ్బరామిరెడ్డి, నామా నాగేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, తెలంగాణ మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహా, సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావు, ఎంపీ ధర్మపురి సంజయ్‌, పలు పార్టీల నేతలు తోట చంద్రశేఖర్‌, డాక్టర్‌ భాస్కర్‌ యారమాల, కలెక్టర్‌ దాసరి హరిచందన, సినీ నిర్మాత లు అల్లు అరవింద్‌, బన్నీవాసు తదితరులు నివాళులర్పించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క నాదెండ్ల కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. మధ్యాహ్నం నాదెండ్ల భాస్కరరావు భౌతికదేహా న్ని పంజాగుట్ట శ్మశానవాటికకు తరలించారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భాస్కరరావు పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి చితికి నిప్పంటించారు. శ్మశాన వాటికకు జయప్రకాశ్‌ నారాయణ్‌, కేవీపీ రామచందర్‌రావు వచ్చి నివాళులర్పించారు.

Updated Date - Apr 24 , 2026 | 03:53 AM