6 గ్యారంటీల ప్రస్తావనేదీ?: రాంచందర్‌రావు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:14 AM
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరోటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల ప్రస్తావనే లేని ...
హైదరాబాద్, మార్చి20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరోటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల ప్రస్తావనే లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో! ఎందుకంటే గత బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు’అని ఎద్దేవా చేశారు. అర్చకుల వేతనాలు పెంచాలని, ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్ పెంచాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా, మైనారిటీల కోసం బడ్జెట్‌ను రూ.700 కోట్లు పెంచడం ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌లో భాగమేనని విమర్శించారు.