Share News

సంస్థ అభివృద్దికి అంకితభావంతో పని చేయాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:04 AM

సంస్థ అభివృద్దికి అందరూఉద్యోగులు, అధికారులు అనే తేడా లేకుండా అందరు అంకితభావంతో పని చేయాలని అప్పుడే ప్రగతి పథంలో ముందుంటామని మందమర్రి జీఎం రాధాక్రిష్ణ పేర్కొన్నారు.

సంస్థ అభివృద్దికి అంకితభావంతో పని చేయాలి
ఉత్తమ కార్మికులను సన్మానిస్తున్న జీఎం రాధాక్రి ష్ణ

మందమర్రిలో 75శాతం ఉత్పత్తి

త్వరలోనే ఆర్‌కేఓసీ ఫేజ్‌-2 పనులు ప్రారంభం

- జీఎం రాధాక్రిష్ణ

మందమర్రిటౌన్‌,జనవరి26(ఆంధ్రజ్యోతి): సంస్థ అభివృద్దికి అందరూఉద్యోగులు, అధికారులు అనే తేడా లేకుండా అందరు అంకితభావంతో పని చేయాలని అప్పుడే ప్రగతి పథంలో ముందుంటామని మందమర్రి జీఎం రాధాక్రిష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలోనిర్వహించిన గనతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా సంస్థలోని వివిధ డిపార్టుమెంట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలకు పూల మాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉద్యోగులు, వారి కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు.మందమర్రి ఏరియాకు 2025-26 ఆర్థికసంవత్సరానికి నిర్దేశించిన 29లక్షల టన్నులు కాగా 75శాతం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. భూగర్భ గనుల విషయానికి వస్తే కేకే5గని వందకు వందశాతం ఉత్పత్తిని సాధించి ముందుందని ఈ సందర్భంగా ఆ గని అధికారులను ఉద్యోగులను అభినందించారు. సంస్థలో ఉద్యోగుల సంక్షేమం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రమాదరహిత ఉత్పత్తి లక్ష్యంగా రక్షణ విషయంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.నాణ్యమైన బొగ్గుకే మార్కెట్‌లో మంచి రేటు ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, ఉద్యోగులు బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటించాలని మంచి బొగ్గును ఉత్పత్తి చేస్తే మంచి ధర పలుకుతుందన్నారు. పోటి ప్రపంచాన్ని తట్టుకోవాలంటే నాణ్యతతోనే సాధ్యమన్నారు. ఇతర దేశాల నుంచి బొగ్గుతక్కువ ధరకే దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు అధికారులు కూడ దీనిని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవాలన్నారు. మందమర్రి ఏరియాలో త్వరలోనే ఆర్‌కే ఓసీ ఫేజ్‌-2 పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏరియాకు మంచి భవిష్యత్‌ ఉండాలంటే సమయంతో సంబంధం లేకుండా అందరూ క్రమశిక్షణతో పని చేయడం మంచిదని తెలిపారు. ఇటీవల కోలిండియాలో మందమర్రికి చెందిన కల్చరల్‌టీం గోల్డ్‌మెడల్‌ సాధించడం అభింనందించదగ్గ విషయమని అదే విధంగా ఆయా క్రీడాకారులు కూడ పథకాలు సాధించి కోలిండియాలో సింగరేణి కీర్తి పతాకాన్ని చాటుతున్నారని తెలిపారు. పారిశ్రామిక సంబంఽధాలు మెరుగుపడాలంటే కార్మిక సంఘాలు కూడ పరస్పర సహకారంతో సంస్థ అభివృద్దే లక్ష్యంగా యూతను అందించాలన్నారు. మరో నాలుగు రోజుల్లోమందమర్రి ఏరియాలోని పాలవాగు ఒడ్డున అటవి ప్రాంతంలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మజాతరలకు మెరుగైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్పత్తి మాసమైనందున ఉద్యోగులు మొదటికి వెళ్లకుండా ఇక్కడే మొక్కులు చెల్లించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సంస్థ మనదనే భావనతో పని చేయడం ద్వారా అభివృద్దిలో అగ్రగామిగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం ఎల్‌ ప్రసాద్‌, అధికారుల సంఘం అధ్యక్షులు రమేశ్‌, పీఎం అశోక్‌, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, అన్నిగనుల సంక్షేమాధికారులు కాగా చిన్నారులు ప్రదర్శించిన సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Jan 27 , 2026 | 12:04 AM