సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:40 PM
బాధితుల సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయా లని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశం
నాగర్‌కర్నూల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : బాధితుల సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయా లని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించు కు ని నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయంలో ని ప్రజావాణి మంది రంలో సోమవారం ప్ర త్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణికి మంచి స్పందన లభిం చింది. వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన చిన్నా రులు, విద్య, వైద్యం, రవాణా తదితర అంశా లకు సంబంధించిన స మస్యలను జిల్లా కలె క్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వివరించి విన తి పత్రాలు అందజేశారు. కలెక్టర్ విద్యార్థుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్య లను శ్రద్ధగా విన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ పరిపాలన అధికారి చంద్రశే ఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 10 ఫిర్యాదులు
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పో లీస్ ప్రజావాణికి పది ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫి ర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్ర కారం పరిష్కరించాలని అధికారులకు సూచ నలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యా దుదారుల నుంచి భూమికి సంబంధించి 4, తగున ఆ్యయం గురించి-4, కుటుంబ గొడవలకు సంబంధించి-2 ఫిర్యాదులు వచ్చాయని అదనపు ఎస్పీ తెలిపారు.