సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:22 PM
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వ యంతో పనిచేసి ప్రజా సమస్యలపై చొరవ చూ పాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- మండల సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
వంగూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వ యంతో పనిచేసి ప్రజా సమస్యలపై చొరవ చూ పాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం వంగూరులోని ఐకేపీ భవనంలో మండల స్థాయి సర్వసభ్య స మావేశం ఎంపీడీవో శారద అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథి గా హాజరయ్యారు. అధికారులతో శాఖల వారీగా సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి పోయా యని ప్రతీ ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకో వాలని సూచించారు. విద్యుత్ విషయంలో వ్యసాయరంగానికి విద్యుత్ సరఫరాలో సమస్య ఎదురయ్యే అవకాశాలున్నా యని చెప్పారు. కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ సు రేందర్‌రెడ్డి, ఎంపీవో రమేష్ కుమార్, సర్పంచులు, అధికా రులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చారకొండ, (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభా వంతో తీవ్ర కరువు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ నుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అ చ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో శంకర్‌నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పను లపై ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసు కొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో స ర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రైతులు వరిపంట కాకుండా ప్రత్యామ్మాయ పం టలు సాగుచేసుకోవాలని అన్నారు. కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్, త హసీల్దార్ ఎం.ఉమా, మండల ప్రత్యేక అధికారి రఘునాథ్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈమణిపాల్ నాయక్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.