Share News

సమన్వయంతో పని చేయాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:14 PM

టరు జా బితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ స జావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయం తో పని చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

సమన్వయంతో పని చేయాలి
బల్మూరు : కొండనాగుల గ్రామంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- సర్‌ విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం

నాగర్‌కర్నూల్‌/ ఉప్పునుంతల/ బల్మూరు/ వంగూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జా బితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ స జావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయం తో పని చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్ట రేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్షా సమా వేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జి ల్లాలో సర్‌ కార్యక్రమ పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగు తోందని తెలిపారు. ఓటర్ల వివరాల డిజిటలైజేష న్‌ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేస్తోందని తె లిపారు. జిల్లాలో మొత్తం 7,31,632 మంది ఓట ర్లు నమోదై ఉండగా ఇప్పటి వరకు 4,77,958 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్‌ చేసిన ట్లు మొత్తం ఓటర్లలో 65.33శాతం పూర్తయిం దని తెలిపారు. మిగిలిన ఓటర్ల వివరాలను కూడా నిర్ణీత గడువులోగా నమోదు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సర్‌ గడువును ఆ గస్టు 3వ తేదీ వరకు అవకా శం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలె క్టర్‌ అరుణారెడ్డి, ఎన్నికల వి భాగం సూపరింటెండెంట్‌ ర వి కుమార్‌, డీటీ కల్పన, వివి ధ రాజకీయ పార్టీల ప్రతిని ధులు రాజేందర్‌, బాలకృష్ణ, ఎండీ హుస్సేన్‌, డేవిడ్‌ రాజు, ఏ.విష్ణు, శ్రీనరసిం హ, పెద్దిరాల రమేష్‌, పి.నరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

నాణ్యతలో రాజీ పడొద్దు

ఉప్పునుంతల మండలం రాయిచేడ్‌ గ్రామం లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశా ల నిర్మాణ పనులను కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. నాణ్యతలలో రాజీ పడవ ద్దని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నియోక జ వర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల కీలకంగా మారుతుందని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం ఇదే గ్రామంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీ లించారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, ఇంజనీ రింగ్‌, ఇతర శాఖల అధికారులు, సర్పంచు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌లో భాగస్వామి కావాలి

బల్మూరు మండలం కొండనాగుల గ్రామం లోని 216వ పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్‌ పార్వతమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తూ వారి ఫొటోలను కలెక్టర్‌ స్వయంగా తీసి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి నమోదు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రతీ ఓటరు తప్పనిసరిగా భాగస్వా మి కావాలని కలెక్టర్‌ అన్నారు. ప్రతీ ఓటరు తన వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించ డంతో పాటు అవసరమైన పత్రాలను బీఎల్‌వో లకు అందజేయడం అత్యంత కీలకమని అన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:14 PM