మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:55 PM
త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సా ధించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్
నస్పూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సా ధించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. నస్పూర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికలను పురష్కరించుకుని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి బా ల్క సుమన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. కార్యకర్తలు, నాయకులు వా ర్డు, డివిజన్‌లల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకుండా మో సం చేసిందని ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. స్థానిక సమస్య లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జిల్లా లోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పని చేయాలన్నారు. 31వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బి. రాజేశ్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనకు బాల్క సుమన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, నలుమాసు కాంతయ్య, రాజా రమేష్, వంగ తిరుపతి, గాదె సత్యం, అత్తి సరోజ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.