kumaram bheem asifabad- విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:24 PM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి శనివారం నోడల్ అదికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి శనివారం నోడల్ అదికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అదికారుల పాత్ర కీలకమైనదని తెలి పారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర ప్రింటింగ్, మీడియా సమన్వయం, సిబ్బంది శిక్షణ, మ్యాన్‌పవర్, వాహనాల కేటాయింపు, అభ్యర్థుల ఖర్చుల పరిశీలన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వంటి అంశాలను పటిష్టంగా అమలు చేసి మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలని తెలిపారు. గతంలో నోడల్ అధికారులుగా వ్యవహరించిన వారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు నోడల్ అధికారులుగా ఉన్నారని అన్నారు. గత అనుభవంతో ఎలాం టి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
నిరుపేదలను గుర్తిస్తున్నాం
ఆసిఫాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరుపేదలను గుర్తిస్తున్నామని కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీసీ గౌతమ్‌తో కలిసి శనివారం వీసీ ద్వారా కుమరం భీం ఆసిఫాబాద్, వికారా బాద్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల కలెక్టర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్యదేవరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట భవన సముదాయంలో గల వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి దత్తారావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి ఆధార్ కార్డు, సామాజిక పెన్షన్‌లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, బ్యాంకు ఖాతా, పిల్లల విద్య, పక్కా గృహాలు, ప్రతీ ఇంటికి తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు వివరాలను పరిశీలించి లేని వారిని గుర్తించి వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నిరుపేదలు ఎదుర్కొంటున్న వ్యాధులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ తాగునీరు, మరుగుదొడ్డి నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆహార భద్రత కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతామని అన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డులు లేని వారిని గుర్తించి కార్డులు అందించడంతో పాటు వంద రోజుల పని దినాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం కింద మౌలిక వసతుల కల్పనకు అధికారులతో సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా సమన్వయకర్త అనిల్ తదితరులు పాల్గొన్నారు.