Share News

జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:45 PM

జాతీయ స్థాయి క్రీడల్లోనల్లమల నుం చి రాణించాలని ఎమ్మెల్యే డా క్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
టెన్నిస్‌ బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : జాతీయ స్థాయి క్రీడల్లోనల్లమల నుం చి రాణించాలని ఎమ్మెల్యే డా క్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆది వారం పట్టణంలోని ఎన్‌టీ ఆర్‌ స్టేడియంలో జరిగిన ఫై నల్‌ టెన్నిస్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో గెలుపొం దిన టీంకు బహుమతులు అందజేశారు. పట్ట ణంలోని రాజీవ్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని ర కాల హంగులతో తీర్చిదిద్దడానికి రూ.10కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. త్వరలో అ చ్చంపేటలో ఆల్‌ ఇండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్ర భుత్వ ఆసుపత్రిని తనిఖీచేశారు. డాక్టర్లు, నర్సిం గ్‌ సిబ్బంది, ఎవరైనా విధుల్లో అలసత్యం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, మునిసినల్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, కౌన్సిలర్‌ గోపి శెట్టి శివ, ఎస్‌ఐ సద్దాం హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:46 PM