అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:29 PM
: గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని అలాంటి ప్రతిభను గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తే అం తర్జాతీయ స్థాయిలో రాణించే అథ్లెటిక్స్ లుగా ఎదుగుతారని కల్వకుర్తి మాజీ స ర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ అన్నారు.
అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్‌గా రాణించాలి
- మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్
కల్వకుర్తి, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని అలాంటి ప్రతిభను గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తే అం తర్జాతీయ స్థాయిలో రాణించే అథ్లెటిక్స్ లుగా ఎదుగుతారని కల్వకుర్తి మాజీ స ర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ అన్నారు. వచ్చే నెల 7వ తేదీన హనుమకొండ జవ హర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిం చనున్న 5వ జాతీయ జావెలిన్ త్రో దినోత్సవం, 1వ తెలంగాణ రాష్ట్ర కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్‌కు సంబం ధించిన నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి ఎంపికల ను ఆదివారం కల్వకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్‌తో కలిసితో ఆనంద్‌కుమార్ ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో చిన్న వ యస్సు నుంచే క్రీడలపై ఆసక్తిని పెంపొందిం చడం ఎంతో అవసరమన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి 150మందికి పైగా క్రీడాకారులు ఎంపి కలో పాల్గొన్నారని తెలిపారు. ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండల్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిత్తరి శ్రీనివాసులు, జీడి పల్లి సర్పంచ్ అంజి, జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు అంజయ్, పీఈటీలు, ఉ పాధ్యాయులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.