కఠినంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:02 PM
జి ల్లాలోని రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్‌లు అందుబాటు లో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసు కోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : జి ల్లాలోని రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్‌లు అందుబాటు లో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసు కోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు. రైతులను మోసం చేస్తూ నకిలీ ఎరువుల త యారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై ఎలాంటి రాజీ లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేస్తూ మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. నకిలీ ఎరువుల అక్రమ రవాణా, ని ల్వ సరఫరా వ్యవహరంలో మొత్తం 9మంది ప్ర మేయం ఉన్నట్లు గుర్తించామని, వారిలో ఏడు గురిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరో ఇద్దరినీ పట్టుకునేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసా గిస్తున్నాయని తెలిపారు.
సమన్వయంతో పని చేయాలి
మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హేమం త కేశవ్ పాటిల్ అధికారులకు సూచిం చారు. మంగళవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ సంగ్రా మ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ జిల్లా స్థా యి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమా వేశం నిర్వహించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మాట్లాడుతూ జిల్లా లో మాదక ద్రవ్యాల నియం త్రణను మరింత సమర్థ వంతంగా అమలు చేస్తున్న దని తెలిపారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు చెన్న య్య, దేవ సహాయం, అదన పు ఎస్పీవెంకటేశ్వర్లు, జిల్లా ఎక్సైజ్ అధికారి, జిల్లా వై ద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లావ్యవసా య అధికారి, జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్, అన్ని సబ్ డివిజనల్ మే జిస్ట్రేట్లు, శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ కలె క్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మంది రంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్లు దేవసహాయం, అదనపు ఎస్పీ వెంకటే శ్వర్లుతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
పబ్బతి ఆంజనేయస్వామి సన్నిధిలో కలెక్టర్
అచ్చంపేట/ పదర, (ఆంధ్రజ్యోతి) : అచ్చం పేట నియోజకవర్గం పదర మండలం మద్దిమ డుగు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయాన్ని మంగ ళవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ భక్తిశ్ర ద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ అర్చకుడు వీరయ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు. ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నా టారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అఽధికా రి రేవంత్‌చంద్ర, ఎంపీడీవో సుధాకర్, స్థానిక ఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు, ఆలయ అర్చ కులు, ప్రజాప్రతినిఽధులు, భక్తులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ మంగళవారం పదర మండల పర్యటనకు రానున్నారనే సమాచారంతో మండ లంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కసారిగా హడావుడి నెలకొంది.