గడువులోగా పరిశీలించాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:27 PM
నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిశీ లించి అర్హతల ఆధారంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతుందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- పట్టభద్రుల ఓటరు దరఖాస్తులపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిశీ లించి అర్హతల ఆధారంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతుందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుం చి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధా న అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ బి.చెన్నయ్యతో కలిసి కలెక్టర్ హాజర య్యా ు. జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని ఇప్పటి వరకు నమోదైన ఓటర్ల వివరాలను, ద రఖాస్తుల పరిశీలన స్థితిని రాష్ట్ర ఎన్నిక ల ప్రధాన అధికారికి కలెక్టర్ వివరిం చారు. ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధి లో 38,377 మంది పట్టభద్రులు ఓటర్లుగా న మోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. 80 శాతం దరఖాస్తులను పరిశీలించి ఆమోదించి నట్లు తెలిపారు. మిగతా దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలన పూర్తి చేస్తామని తెలిపా రు. ఈ వీసీలో ఆర్డీవోలు అర్చన, బన్సీలాల్, జ నార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఎన్నికల విభాగం సూప రింటెండెంట్ ఎన్నికల డీటీ కల్పన పాల్గొన్నారు.