వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:15 PM
టీపీ ఎస్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో జాప్యం చేయ కుండా వేగంపెంచి, గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు.
- టీపీఎస్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
వంగూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : టీపీ ఎస్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో జాప్యం చేయ కుండా వేగంపెంచి, గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు. గురువారం వంగూరు మండల కేంద్రం లో, పోల్కంపల్లి గ్రామాల్లో రూ. 15 కోట్లతో ని ర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం ఆమోదించిన మ్యాప్, డిజైన్, నిర్మాణ ప్రణాళిక ప్రకారమే పనులు చేపట్టా లని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడం తో పాటు పనుల పూర్తికి తీసుకుం టున్న చర్యలపై అధికారులతో చర్చిం చారు. నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటిప్పుడు స మీక్ష నిర్వహించి ఎదురవుతున్న సమ స్యలను వెంటనే పరిష్కరించాలన్నా రు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ పా ఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమై న విద్య అందనుందని, పాఠశాలను త్వరగా ఏ ర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పె రిగే అవకాశం ఉందన్నారు కార్యక్రమంలో డీఈ వో రమేష్ కుమార్, సర్పంచ్ పురుగుల యా దయ్య, ఎంఈవో కొండల్‌రెడ్డి, అంకు సురేందర్, ఇంజనీర్ అధికారులు పాల్గొన్నారు.