Share News

సభ్యత్వంలో రాష్ట్రంలో ముందుండాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:44 PM

నాన్‌ గెజిటెడ్‌, అన్ని శాఖల ఉద్యో గుల నుంచి టీఎన్జీవో సభ్యత్వంను ఈనెల10లోపు జిల్లా వ్యాప్తంగా చేపట్టి రాష్ట్రంలో సభ్యత్వంలో జిల్లాను ముందుంచాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య కోరారు.

 సభ్యత్వంలో రాష్ట్రంలో ముందుండాలి

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

దండేపల్లి జనవరి 8 (ఆంద్రజ్యోతి): నాన్‌ గెజిటెడ్‌, అన్ని శాఖల ఉద్యో గుల నుంచి టీఎన్జీవో సభ్యత్వంను ఈనెల10లోపు జిల్లా వ్యాప్తంగా చేపట్టి రాష్ట్రంలో సభ్యత్వంలో జిల్లాను ముందుంచాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య కోరారు. గురువారం లక్షెట్టిపేట యూనిట్‌ అధ్యక్షుడు గోళ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యలయంలో సుమారు 110 మంది నుంచి నాన్‌ గెజిటెడ్‌ టీఎన్జీవో సభ్యత్వం స్వీకరించారు. వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా లోని అన్ని యూనిట్‌ పరిధిలోని సంఘం నాయకులు ప్రతిరోజు మద్యా హ్నం సభ్యత్వం చేపట్టాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న వాటి పరిష్కారం కోసం ముందు ఉంటామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భూముల రామ్మోహన్‌, శ్రీపతి బాపురావు, గోపాల్‌, శ్రావణ్‌కు మార్‌, భూమన్న, టీఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:44 PM