‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:30 PM
విద్యార్థులు మెరుగైన ఫలితా లు సాధించేలా నాణ్యమైన బోధన అందజేయాలని విద్యా ర్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ కుమార్ అ న్నారు.
- డీఈఓ రమేశ్ కుమార్
అచ్చంపేట/ ఉప్పునుంతల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు మెరుగైన ఫలితా లు సాధించేలా నాణ్యమైన బోధన అందజేయాలని విద్యా ర్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ కుమార్ అ న్నారు. అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిష త్ బాలికల ఉన్నత పాఠశాల, మహాత్మాజ్యోతి బాఫూలే గురుకుల పాఠశాల, పలకపల్లి ప్రాథ మికోన్నత పాఠశాల, ఉప్పునుంతల జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఉప్పునుంతల జిల్లా పరిషత్ పాఠ శాలలో కొనసాగుతున్న పదవ తరగతి విద్యార్థు ల ప్రత్యేక తరగతులను డీఈవో పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. స బ్జెక్టుల్లోని సిలబస్ పూర్తిగా అయ్యిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం వివరాలపై అడిగి తెలుసు కుని విద్యార్థులకు అందించే ఆహారపదార్థాల ను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ వి ద్యార్థులకు గుణాత్మకమైన విద్యాబోధన అందిం చడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. పిల్లల ఆరో గ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠ శాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని డీఈ వో పరిశీలించారు. విద్యార్థుల పదవ తరగతి సబ్జెక్టుల్లో సామర్థ్యాలను పరిశీలించి పలు సల హాలు, సూచనలు అందజేశారు. మార్చి16 నుం చి పదవ తరగతి పరీక్షలు ఉన్నందున మెరు గైన ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు ఉపాధ్యా యులందరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈవో సూచించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం అవసరమైన అన్ని పాఠ్యాంశాలు బోధిం చే ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా విద్యా ర్థుల సామర్థ్యాలను పరిశీలించాలని, ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన సూచించారు. పదవ తరగతివిద్యార్థులు స్నాక్స్ అందజేశారు. డీఈవో వెంట ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.