భార్యను హత్య చేసి ఆత్మహత్య
ABN , Publish Date - May 30 , 2026 | 12:17 AM
భార్యను హతమార్చి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మహ్మద్ షర్ఫుద్ధీన్ (60), తన భార్య షాహిన్ (55) ఓ అద్దె ఇంటిలో ఉండి జీవనం
తంగళ్లపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): భార్యను హతమార్చి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మహ్మద్ షర్ఫుద్ధీన్ (60), తన భార్య షాహిన్ (55) ఓ అద్దె ఇంటిలో ఉండి జీవనం సాగిస్తున్నారు. షర్పుద్ధీన్ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తుండగా షాహిన్ కూలిపని చేస్తోంది. రోజు మాదిరిగానే శుక్రవారం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన దంపతులు ఇంటిలోకి వెళ్లి సాయంత్రం వరకు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. షర్పుద్ధీన్ తన భార్యను హత్య చేసి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా వివాహాలు జరిగాయి. వీరికి రూ.5లక్షల మేర అప్పులు అయ్యాయని దీంతో తరుచూ మనస్థాపానికి గురయ్యేవారని ఈ నేపథ్యంలోనే ఇరువురూ మృతిచెంది ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.